
గూడూరు: “అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడవాలి” అని జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
సమాజంలోని అంటరానితనం నిర్మూలన కోసం అంబేద్కర్ చేసిన కృషిని, అలాగే రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించిన గొప్ప మహానుభావుడని ఆయన కొనియాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. భారత రాజ్యాంగంలో ఆయన కల్పించిన హక్కులు మహిళలు మరియు బలహీన వర్గాలకు సంపూర్ణంగా అందినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కుల కోసం యువత అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గ పి.ఓ.సి కె. మోహన్ మాట్లాడుతూ, అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన యోధుడని కొనియాడారు. ఆయన నాయకత్వ లక్షణాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాయికిరణ్, వంశీ కృష్ణ, సాయి కృష్ణ, వసంత్, వీరమహిళ తులసి, లీగల్ సెల్ సుమన్, ఐటీ విభాగం శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.