
- అంబేద్కర్ అందరివాడు.. యుగపురుషుడు
- అంబేద్కర్ భారతీయుడిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టం
- 135వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు: ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన డా.బి.ఆర్. అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పేర్కొన్నారు.. డా.బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈరోజు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలి. ప్రజల్ని చైతన్య పరచాలి. ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహనపై మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే శక్తివంతమైన చైతన్యం అందించే దిశగా డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను, ఆశయాలను దీనికి జోడించి రాబోయే తరానికి ఈ నవ సమాజ నిర్మాణంలో భాగంగా అందరం కూడా భాగస్వాములు కావాలని, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేవిధంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుంది” అని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
అంబేద్కర్ అందరివాడు. యుగ పురుషుడు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ తరుపున కూటమి ప్రభుత్వం తరఫున ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అనంతరం 3వ డివిజన్ నవాబ్ పేటలో, 13వ డివిజన్ ఇందిరా కాలనీలో, 6వ డివిజన్ చాటపర్రు రోడ్డు లో మాత్రపు లోకేష్ ఆధ్వర్యంలో, మరియు ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ లో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్ రావు, నగర అధ్యక్షులు వీరంకి పండు, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, సరిది రాజేష్, కోయ సత్తిబాబు, రెడ్డి గౌరీ శంకర్, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, కూనిశెట్టి మురళీ కృష్ణ, అచ్యుత్ నాని, జనసేన రవి, బుధ్ధా నాగేశ్వరావు, నూకల సాయి, బెజవాడ నాగభూషణం, వాసా సాయి, శానం శ్రీరామకృష్ణ మూర్తి, కొండల ప్రసాద్, అంబేద్కర్ కమిటీ సభ్యులు కొసనం ప్రమీల, పల్లి విజయ్, భూపతి ప్రసాద్, తోట రాజేష్, సానాసి వెంకట రమణ, తోట నాగరాజు, బి.అంజి, బి.రాము, కె.రాజేష్, బి.కాళీ, జె.అశోక్, బి.సత్తి తదితరులు పాల్గొన్నారు.