
అమలాపురం: అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. నల్లవంతెన వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.