
అమలాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్థానిక నల్లా వీధిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.
తదనంతరం నల్లవంతెన వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి “జై భీమ్” నినాదాలతో ఆయన సేవలను స్మరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి జనసేన నాయకులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్, కల్వకొలను తాతాజీ, ఇసుకపట్ల రఘు బాబు, యేడిద శ్రీను, ఆర్డీఎస్ ప్రసాద్, పరమట చిట్టిబాబు, చిక్కం సుధా మోహన్, కంకిపాటి గోపి, నల్లా వెంకటేశ్వరరావు, సుధా చిన్న, బండారు వెంకన్న బాబు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, మహాదశ నాగేశ్వరరావు, ముత్యాల మణేమ్మ, డి.యస్.యన్ కుమార్, నల్లా చైతన్య, పోలిశెట్టి మహేష్, కుంపట్ల రమేష్, గట్టం వీరు, చికిలే చిట్టిబాబు, యాళ్ళ బిందాస్ తదితరులు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.