కువైట్‌లో ఏపీఎన్‌ఆర్‌టీఎస్ నూతన కోఆర్డినేటర్లకు ఘన సన్మానం

కువైట్‌లో ఏపీఎన్‌ఆర్‌టీఎస్ నూతన కోఆర్డినేటర్లకు ఘన సన్మానం

కువైట్: కువైట్‌లో ఏపీఎన్‌ఆర్‌టీఎస్ నూతన కోఆర్డినేటర్ల అభినందన, సన్మాన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్ గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ కంచన శ్రీకాంత్, గల్ఫ్ జనసేన నాయకులు అంజన్ కుమార్, ఆకుల రాజేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కోఆర్డినేటర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ ఏపీఎన్‌ఆర్‌టీఎస్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు చేపట్టిన వారు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం పనిచేసే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు, జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

కువైట్‌లో నివసిస్తున్న తెలుగు ప్రవాసులకు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అందిస్తున్న సేవలను మరింత చేరువ చేయడంతో పాటు సంస్థ సభ్యత్వాన్ని విస్తృతం చేసేందుకు ప్రతి కోఆర్డినేటర్ కృషి చేయాలని కోరారు. ప్రవాసాంధ్రులకు అందుబాటులో ఉన్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితుల్లో అందించే సహాయంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రవాసాంధ్ర భరోసా భీమాపై దృష్టి

సమావేశంలో ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకంపై ప్రత్యేకంగా చర్చించారు. విదేశాల్లో పనిచేస్తున్న ప్రవాస కార్మికులు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో భీమా ప్రాధాన్యతను వివరించారు. కువైట్‌లోని తెలుగు ప్రవాస కుటుంబాలకు భీమా ప్రయోజనాలపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందేలా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా 5,000 మందికి ఉచిత భీమా

పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గల్ఫ్‌లోని ఆరు దేశాల్లో సమన్వయంతో 5,000 మంది ప్రవాసాంధ్రులకు ఉచిత ప్రవాసాంధ్ర భరోసా భీమా సభ్యత్వాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రవాసుల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేసి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని నాయకులు పిలుపునిచ్చారు.

నూతన కోఆర్డినేటర్లకు సన్మానం

నూతనంగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు స్వీకరించిన కుంచా నగేష్, జోగినేని నాగేంద్రబాబు, కొమ్మినేని బాలాజీ, సానబోయిన పనీంద్ర, చింతల వెంకటేష్, అప్పిన చిరంజీవి, గుంటూరు శంకర్, గిడుగు రాంబాబును ఘనంగా సన్మానించారు. కోలా శ్రీకాంత్, గ్రందే ప్రసాద్, సిశెట్టి మల్లికార్జునకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ జనసేన నాయకులు అంజన్ కుమార్, ఆకుల రాజేష్, ఇమ్మిడిశెట్టి సూర్య, జగిలి ఓబులేష్, షేక్ అలీ, గంగారపు చంద్రశేఖర్, రెడ్డిచర్ల ఆంజనేయులు, నల్లం శెట్టి కిషోర్, కుంచ శివ తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సభ్యత్వ నమోదు, ప్రవాసాంధ్ర భరోసా భీమా విస్తరణ కార్యక్రమాలకు గల్ఫ్ జనసేన నాయకులు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఏపీఎన్‌ఆర్‌టీఎస్, జనసేన నాయకత్వం సమన్వయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.