అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం, గుంతకల్ జిల్లాసాధన సమితి ఆధ్వర్యంలో నేడు గుంతకల్ పట్టణం డాక్టర్ “బాబాసాహెబ్ అంబేద్కర్” విగ్రహం సర్కిల్ వద్ద చేస్తున్న నిరసన దీక్షకు అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ మరియు మండల అధ్యక్షుడు కురుబ పురుషోత్తం లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ గుంతకల్ పట్టణం అనేక ఉపాధి అవకాశాలు కలిగినటువంటి స్పిన్నింగ్ మిల్లు, స్లిప్పర్ ఫ్యాక్టరీ, లెదర్ ఫ్యాక్టరీ, టైర్ ఫ్యాక్టరీ మరియు రైల్వే జోన్ విషయంలో మోస పోయిందని ఇప్పుడు మరీ కొత్త జిల్లాల విషయంలోనూ అదే జరుగుతుందని గుంతకల్లు జిల్లా ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలు మరియు దేశంలో ఎక్కడికైనా చేరుకోడానికి అతిపెద్ద రైల్వే జంక్షన్ భౌగోళికంగా అన్ని రకాల వసతులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. 1956 నుండి గుంతకల్లు జిల్లాకు కావాల్సిన అర్హతలు కలిగి ఉంది కానీ నాయకులు నిర్లక్ష్యం, స్వార్థం ప్రజల పాలిట శాపంగా మారింది అన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి గుంతకల్లును జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లోగుంతకల్ జిల్లాసాధన సమితి చేపట్టబోయే ప్రతి ఉద్యమానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయిధరంతేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, సూర్యనారాయణ, గాజుల రాఘవేంద్ర, సుబ్బయ్య, మధు, మంజు తదితరులు పాల్గొన్నారు.