అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట: టి.సుండుపల్లిలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేత రామ శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ వాదులు, ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులు, మిత్రబృందంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం జయంతి సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో నిర్వహించిన గ్రామసభలో కూడా రామ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు.

భారతదేశానికి సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థను అందించిన రాజ్యాంగ నిర్మాతగా ఆయన సేవలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు, జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.