
కరీంనగర్, ఆగస్టు 26, 2026:
జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం, కరీంనగర్ కాశ్మీర్‌గడ్డ యూనిట్ ఆధ్వర్యంలో షాలిమార్ ఫంక్షన్ ప్యాలెస్‌లో “Prophet Muhammad – An Icon of Peace, Justice and Tolerance” అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జనసేన కరీంనగర్ నాయకురాలు డా. సాయి కృష్ణ ప్రియ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మతాలు వేరైనా మనమందరం మనుషులమే. శాంతి, న్యాయం, సహనం, పరస్పర గౌరవం అనే విలువలే సమాజాన్ని కలిపి ఉంచుతాయి” అని పేర్కొన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, న్యాయం, సహనం వంటి విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు.
“ద్వేషానికి బదులు ప్రేమను పంచాలి… విభేదాలకు బదులు ఐక్యతను పెంచాలి… మతాలకు అతీతంగా శాంతి కోసం ప్రతి ఒక్కరూ గొంతు కలపాలి” అని పిలుపునిచ్చారు.
మహిళలు సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలని డా. సాయి కృష్ణ ప్రియ పేర్కొన్నారు. ఇటువంటి సామరస్య కార్యక్రమాన్ని నిర్వహించిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం నిర్వాహకులను ఆమె అభినందించారు.