
ఉన్నత ప్రమాణాలతో జూనియర్ కళాశాల నిర్మాణం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం గణేష్ నగర్‌లో ప్రజల భాగస్వామ్యంతో P4 విధానంలో రూ.2.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దాతల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో ఆధునిక వసతులు కలిగిన కళాశాలను నిర్మిస్తున్నామని తెలిపారు.
నిర్మాణంలో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు సూచించిన ఆయన, ప్రజల సహకారంతో P4 విధానంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.