పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆరణి శ్రీనివాసులు, ఆరణి మధన్

తిరుపతి: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్స్ కమిటీ సభ్యుడు ఆరణి మధన్ మోహన్ గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వారు ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకుని గతంలో మాదిరిగా ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని, జనసేన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించారు.

భేటీ సందర్భంగా ఆరణి మధన్ మోహన్‌కు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ గట్టిగా పనిచేయాలని సూచించారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలిపారు.

ఈ భేటీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, స్థానిక ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.