
అమరావతి: రాజ్యసభ సభ్యులు సానా సతీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు ఆరణి మధన్ మోహన్, క్రికెట్ విజయ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సానా సతీష్‌ను ఘనంగా సత్కరించిన వారు, ప్రజాసేవలో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి మరింత సేవ చేయాలని తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.