
ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా క్యాబినెట్ హోదాతో నియమించడంపై ఆత్మకూరులో జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.
ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ వద్ద జనసేన పార్టీ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ సూచనలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. భారీ కేక్‌ను కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి పవన్ కళ్యాణ్ జిందాబాద్, నాగబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నాగబాబుకు బాధ్యతలు దక్కిన సందర్భంగా అటవీ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా పలువురికి మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్, పసుపులేటి శ్రీరామ్, సయ్యద్ అక్బర్ బాషా మాట్లాడుతూ.. ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ సూచనలతో, తమ నేత చదలవాడ హరీష్ కుమార్ ఆదేశాలతో ఈ సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విధానపరంగా ముందుకు సాగుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని అన్నారు.
పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయనేందుకు నాగబాబు నియామకం నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నాగబాబుకు లభించిన బాధ్యతతో జనసేన పార్టీ మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కలుగుతుందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు