
మదనపల్లి: మదనపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక సెస్మహల్ ప్రాంతంలో ఉన్న బాల సదన్‌లో మెగాస్టార్ చిరంజీవి ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మదనపల్లి చిరంజీవి యూత్ అధ్యక్షులు సుప్రీమ్ నౌషాద్, మెగా యూత్ ఫోర్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కన్వీనర్ మౌర్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
బాల సదన్‌లోని పిల్లలతో కేక్ కట్ చేయించి చిరంజీవి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు స్కూల్ బ్యాగులు, స్నాక్స్ అందించడంతో పాటు విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ కో-ఆర్డినేటర్ దారం అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెగా కుటుంబం ఎప్పుడూ సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయంలో ముందుంటుందని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేలా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన చిరంజీవి సేవా స్ఫూర్తి అభినందనీయమని పేర్కొన్నారు.
సమాజ సేవలో మెగా కుటుంబం ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని దారం అనిత అన్నారు. చిరంజీవి అభిమానులు కూడా ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి సీనియర్ మెగా అభిమానులు విజయ్, సీనా, మదనపల్లి సాయి చిత్ర టాకీస్ మేనేజర్ గిరిరెడ్డి, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.