
అమలాపురం గడియారం స్థంభం సెంటర్‌లో నో పార్కింగ్ ప్రాంతాల్లో కార్లు, ఇతర వాహనాలను నిలుపుదల చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ ఎస్‌ఐ యేసుబాబు, డీఎస్పీ ప్రసాద్, సీఐ వీరబాబు సూచనల మేరకు గడియారం స్థంభం సెంటర్‌లో నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను నిలుపుదల చేయకుండా నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను నిలిపినట్లయితే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.