గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ కసరత్తు

పిఠాపురం: రానున్న గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్న ఆశావహుల పేర్ల జాబితా పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గొల్లప్రోలు పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జి ఆకుల శ్రీధర్, రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిలు, రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, రాష్ట్ర కార్యదర్శి బొమ్మలు దత్తు, జిల్లా ఇన్‌చార్జిలు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ మాలకొండయ్య, దాట్ల సూర్యనారాయణరాజు, రంబాల వెంకటేశ్వరరావు, అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్‌ఏ గండి కొండలరావు తదితరుల ఆధ్వర్యంలో ఆశావహుల జాబితాను పరిశీలించారు.

మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డులకు సంబంధించి బీజేపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పేర్లను పరిశీలించారు. తొలిదశలో 10 వార్డుల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న ఆశావహుల పేర్లను నమోదు చేసుకున్నారు. మిగిలిన వార్డులకు సంబంధించిన వివరాలను కూడా పరిశీలించి, పూర్తి జాబితాను రాష్ట్ర పార్టీకి అందజేయనున్నట్లు నాయకులు తెలిపారు.

గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై నాయకులు చర్చించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్‌చార్జి బుర్రి, జిల్లా ఎన్నికల కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఘంటసాల గోవింద్, జిల్లా కార్యవర్గ సభ్యులు వీర మోహన్‌రావు, బుర్రి మురళీధరరావు, గొల్లప్రోలు బీజేపీ నాయకులు కర్రి సత్యనారాయణ, పడాల శ్రీను, తంగెళ్ల బాబురావు, చీపురు భాస్కరరావు, వియ్యపు రాములు, కాకి వరలక్ష్మి, ముడదా మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.