
అమలాపురం: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం కొనసాగుతోంది. ‘రెండేళ్ల కూటమి ప్రభుత్వం.. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు.
ఇందులో భాగంగా బూత్ 45 గొల్లగూడెంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు స్థానికంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, క్లస్టర్ ఇన్చార్జి పెచ్చేటి విజయలక్ష్మి, క్లస్టర్ కో-కన్వీనర్ కర్రి రామస్వామి (దత్తుడు), బూత్ కన్వీనర్ షేక్ బాషా, గెల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు.