ఘనంగా వబ్బిన సత్యనారాయణ జన్మదిన వేడుకలు

శృంగవరపుకోట: విజయనగరం జిల్లా, శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ వబ్బిన సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హాజరై వబ్బిన సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదిన వేడుకల సందర్భంగా తొలుత స్థానిక దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. అలాగే ఎస్.కోట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

అనంతరం అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన జనసైనికులు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వబ్బిన సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.