
- ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదం పొందిన కొల్లా శంకర్, వేముల మహేష్
కూకట్‌పల్లి: ఏవీబీ పురం కాలనీలో నిర్వహించిన శ్రీ నీలమణి దుర్గమ్మ, శ్రీ తలుపులమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏవీబీ పురం జనసేన నాయకుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వారు తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవార్ల ఆశీర్వాదం పొందారు. బోనాల జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏవీబీ పురం జనసేన నాయకులు ప్రసాద్, గోవింద్, శివశంకర్, ఈశ్వర్, అల్లాపూర్ డివిజన్ నాయకులు ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.