









ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ కొప్పర్రులో జనసేన నాయకులు, కొప్పర్రు సొసైటీ ఛైర్‌పర్సన్ అందే నరేన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేన్‌గారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
హరి ప్రసాద్ రాక సందర్భంగా నరేన్ కుటుంబ సభ్యులు, మిత్రులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య స్థానిక అంశాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సేవకు సంబంధించిన విషయాలపై ఆత్మీయంగా చర్చ జరిగినట్లు తెలిపారు.