ఉషోదయ హైస్కూల్‌లో ఉచిత కంటి పరీక్షల శిబిరం

రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని రమేష్‌నగర్‌లో ఉన్న ఉషోదయ హైస్కూల్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో, ఫ్రెండ్స్ ఫౌండేషన్, డాక్టర్ భవ్య ఐ హాస్పిటల్ సహకారంతో సోమవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు.

జనసేన నాయకులు మంథని శ్రావణ్, మార్క ఆశ్రిత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు రావుల మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ భవ్య ఐ హాస్పిటల్ వైద్య బృందం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సూచనలు అందించింది. అనంతరం కంటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ఈ సందర్భంగా రావుల మధు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు పోషకాహారం తీసుకుంటూ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.

ఉషోదయ హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి శిబిరం నిర్వహించిన జనసేన పార్టీ నాయకులకు, డాక్టర్ భవ్య ఐ హాస్పిటల్ యాజమాన్యానికి, ఫ్రెండ్స్ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ కానుగంటి మంగ, నాయకులు దాసరి శశాంక్, మనోజ్, ఫ్రెండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు రౌతు గణేష్, మీస వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.