పవన్ కళ్యాణ్ ఆరోగ్యంకోసం అన్నవరంలో ఆయుష్ హోమం

అన్నవరం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని దీర్ఘాయుష్షుతో ప్రజాసేవను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ఆయుష్ హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో వేదపండితులు ఆయుష్ హోమం నిర్వహించగా, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తోలేటి శిరీష, ప్రత్యేక ఆహ్వానితులు గంజి గోవిందరాజు, పత్తిపాడు జనసేన సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, పిఠాపురం మండల జనసేన ఇన్‌చార్జి వెన్నా జగదీష్, జనసేన నాయకులు అడపా శివరామకృష్ణ, కొండపల్లి శివ, తుని ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ కర్ణం సుబ్రమణ్యం, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్వామివారి దివ్య ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.