జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమాయత్తం కావాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి తగరపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ఆదివారం నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను ప్రజలకు బలంగా తీసుకెళ్లి పార్టీ విస్తరణకు కృషి చేస్తామని తగరపు శ్రీనివాస్ తెలిపారు.

సమావేశంలో నియోజకవర్గ నాయకులు కొలుగూరి అనిల్, కొమ్ముల మధుబాబు, నేవూరి పవన్ కుమార్, గంగారపు శ్రీకాంత్, అంబటి శ్రీకాంత్, మంకిడి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.