
ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ముంబయి : ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఆసుపత్రిలో పరామర్శించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్‌కు అందుతున్న వైద్య చికిత్సపై వైద్య బృందం నుంచి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి, విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకోవాలని సూచించినట్లు సమాచారం.