
గుంటూరు: ది గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బోనబోయిన కౌశిక్ కృష్ణ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు అందజేశారు. బ్యాంకు అభివృద్ధితో పాటు ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
బోనబోయిన కౌశిక్ కృష్ణ కూడా తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకు అభివృద్ధి, ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.