తిరుపతి విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం

VBGRAMG జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రైల్వే కోడూరులో నిర్వహించనున్న VBGRAMG జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.