
జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో మొత్తం 39 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ యు. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో అధికారులు నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరమైన విధానంలో విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సంబంధిత ఫిర్యాదులను ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించి, నిర్ణీత గడువులో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, కుటుంబ కలహాలకు సంబంధించిన ఫిర్యాదులు అధిక సంఖ్యలో వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, పామూరు సీఐ వినోద్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.