విద్యుత్ ప్రమాద బాధితుడు మోహన్‌కు జనసేన అండ.. రూ.25 వేల ఆర్థిక సాయం అందజేసిన కొరికాన దంపతులు

మెలియాపుట్టి మండలం రట్టిని గ్రామంలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచే పనుల్లో పాల్గొంటున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన కాంట్రాక్ట్ లైన్‌మన్ ఇప్పలి మోహన్‌కు జనసేన పార్టీ అండగా నిలిచింది.

ప్రమాదంలో గాయపడి శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్‌ను పరామర్శించిన సూడా చైర్మన్ కొరికాన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గ నాయకురాలు కొరికాన భవాని మెరుగైన వైద్య చికిత్స కోసం రూ.25 వేల నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

జనసేన పార్టీ తరఫున అందించిన ఈ ఆర్థిక సాయాన్ని పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ చేతుల మీదుగా బాధితుడు మోహన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.

ప్రజలకు సేవలందించే క్రమంలో ప్రమాదాలకు గురైన కార్మికులకు అండగా నిలవడం సమాజం బాధ్యత అని జనసేన నాయకులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొని మోహన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.