ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి.. అమీర్‌పేటలో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తాత సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ‘జై ఎన్టీఆర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఘాట్ పరిసరాలు సందడిగా మారాయి. భద్రత దృష్ట్యా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం అమీర్‌పేట మైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమం నేపథ్యంలో అమీర్‌పేట పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు, అభిమానులు పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.