శ్రీశైలం దేవస్థానంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం

శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం – దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమం కింద గురువారం శ్రీ రఘురామ భజన మండలి, నంద్యాల వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించబడింది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భక్తి గీతాలు, అష్టకాలు, శివస్తుతి గీతాలు ఆలపించబడ్డాయి. గణపతి స్తుతి, కనరండి కనరండి శ్రీశైలం, శ్రీశైలం శివమయం, శివ శివ అనరాద, అమ్మ పరమేశ్వరి, పాతాళగంగమ్మ, ఏవరికీ ఎవరయ్యా ఈశ్వరా, పంచభూతలనే భ్రమరాంబాదేవినే నమ్మితి వంటి అనేక భక్తి గీతాలు భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి.

ఈ కార్యక్రమంలో హరికృష్ణ, తిరుమలేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి, శివరామిరెడ్డి, భాస్కరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గోపాల్‌రెడ్డి, రమేష్ రెడ్డి, రమణారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఆలాపన చేశారు. తబలా సహకారాన్ని శ్రీనివాస్‌రెడ్డి అందించగా, హార్మోనియం సహకారాన్ని సూర్యచంద్రారెడ్డి, హనుమంతరెడ్డి అందించారు.

ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా మరియు శ్రీ స్వామి అమ్మవార్ల కైంకర్యాలు పరిపూర్ణంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.