పవన్ కళ్యాణ్ అనే నేను” పుస్తకావిష్కరణ ఘనంగా.. గణేష్ మాస్టర్ చేతుల మీదుగా విడుదల

జనసేన పార్టీ హార్డ్‌కోర్ అభిమాని, యంగ్ డైనమిక్ రైటర్ వికాస్ రచించిన “పవన్ కళ్యాణ్ అనే నేను” పుస్తకావిష్కరణ కార్యక్రమం సికింద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో, విఘ్నేష్ మాస్టర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖ కొరియోగ్రాఫర్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని గణేష్ మాస్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ మరియు రచయిత వికాస్ మాట్లాడుతూ.. యువత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ, ఉన్నతమైన ఆలోచనలతో జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, సేవా భావం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు సినీ దర్శకుడు, జనసేన నాయకుడు కేశవపాల్గొణ, భవ్య రెడ్డి పాల్గొన్నారు. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్లు పవన్ కుమార్ సింగ్ మాస్టర్, నిక్సన్ మాస్టర్, చాంప్ మాస్టర్, కపిల్ మాస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, గబ్బర్ సింగ్ సాయి మరియు ఆయన బృందం కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, తల్లిదండ్రులు మరియు ప్రజలతో కార్యక్రమ ప్రాంగణం కళకళలాడిపోయింది.

చివరగా “జై జనసేన” నినాదాలతో కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.