
ఎన్‌జేకే క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో లీగ్ దశ ముగిసిన అనంతరం నిర్వహిస్తున్న సెకండ్ రౌండ్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వీరఘట్టం మరియు తూడి గ్రామాల జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో తూడి గ్రామ జట్టు విజయం సాధించింది. ఈ విజయానికి కీలక పాత్ర పోషించిన హరినాన నవీన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా నవీన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తూడి ఎంపీటీసీ సెగ్మెంట్ తరఫున గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన జానీ అందజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ వండనా రాజు మాస్టర్, తెలుగు యువత అధ్యక్షుడు మాచర్ల అనిల్ బాబు, వీరఘట్టం మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తన తండ్రి దివంగత నిమ్మక గోపాలరావు జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎలాంటి ఫీజు లేకుండా టోర్నమెంట్ నిర్వహించి, ఫైనల్ విజేత జట్టుకు రూ.50 వేల ప్రైజ్ మనీ ప్రకటించడం చిన్న విషయం కాదన్నారు.
గతంలో ఏ ప్రజాప్రతినిధి కూడా యువత కోసం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించలేదని, కానీ యువ నాయకుడు జయకృష్ణ యువతలోని ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. యువతకు అన్ని విధాలా అండగా నిలిచే నాయకులు సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.