
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని కీలకమైన ‘గౌర్నాయుడు’ పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ పాత్రను కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గౌర్నాయుడు ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన పొందగా, తాజాగా వచ్చిన వీడియో గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. శివ రాజ్ కుమార్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పాత్ర తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలను చిత్రబృందం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోంది.
ఈ ప్రమోషన్లలో భాగంగా మే 18న ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అనంతరం మే 23న భోపాల్‌లో ప్రత్యేక కార్యక్రమంలో సినిమా పాటను లాంచ్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు