కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్‌కు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

వారం రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరదిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను ప్రకటించింది. పార్టీ అంతర్గత చర్చలు, సంప్రదింపుల అనంతరం ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

వీడీ సతీశన్ 2001 నుంచి వరుసగా పారవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా ఎదిగిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

2021లో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన సతీశన్, ప్రభుత్వంపై పలు కీలక అంశాల్లో గట్టిగా పోరాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.