
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పుంగనూరులో మంగళవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండాను 100 శాతం స్ట్రైక్ రేట్‌తో ఎగురవేయాలనే లక్ష్యంతో పార్టీ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా వేదికగా మండల జనసైనికుల సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మండల పరిధిలో జనసేన పార్టీకి బలమైన పంచాయతీలను గుర్తించి వాటి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.
ఈ సమావేశంలో పుంగనూరు మండల అధ్యక్షుడు విరూపాక్షి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, మండల నాయకులు శివకుమార్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్ పాల్గొన్నారు.
అలాగే నాయకులు రమేష్, రవికుమార్, జనార్దన్ రాయల్, మహేష్, పవన్ కుమార్, శ్రీరాములు, నాగరాజ, శ్రీనివాసులు, సుబ్బు, సుధాకర్, చౌడప్ప, రాజ, రమణ తదితరులు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.