
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే పార్టీ అధ్యక్షుడు శ్రీ విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ విజయ్ గారితోపాటు మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా అభినందనలు. తమిళనాడులో ఏర్పాటైన నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, పారదర్శకమైన మరియు ప్రగతిశీలమైన పాలనను అందిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. తమిళనాడును మరింత అభివృద్ధి, సుసంపన్న దిశగా నడిపిస్తుందని ఆశిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.