టి. సుండుపల్లి సీఐ కార్యాలయ తనిఖీ.. డీఐజికి కూటమి నేతల స్వాగతం

రాజంపేట: మొదటిసారి టి. సుండుపల్లి పర్యటనకు విచ్చేసిన రాయలసీమ జోన్ గౌరవ డీఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ కుమార్ నూతనంగా ఏర్పాటైన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ నిర్వహణ, పనితీరు, సదుపాయాలను పరిశీలించారు.

ఈ పర్యటనలో కూటమి నేతలతో కలిసి జనసేన పార్టీ సీనియర్ నేత రామ శ్రీనివాస్ డీఐజిని మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. పోలీస్ శాఖ పనితీరు మరింత సమర్థవంతంగా ఉండాలని ఈ సందర్భంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు లక్ష్మీ నారాయణ, శ్రీనివాసరాజు, జీవన్ తదితరులు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.