గుడిమెళ్ళంక ఇళ్ల పట్టాల లేఔట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే దేవ

రాజోలు నియోజకవర్గంలోని గుడిమెళ్ళంక గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో వివిధ గ్రామాలకు చెందిన 374 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయుటకు 9.64 ఎకరాల భూమిని కొనుగోలు చేసి లేఔట్‌గా రూపొందించారు. అయితే ఆ లేఔట్‌లో ఇప్పటివరకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడం, సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అది నిరుపయోగంగా మారిన పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ప్రత్యేకంగా లేఔట్‌లో అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేసి, ప్రతి లబ్ధిదారుడికి వారి భూమిని స్పష్టంగా గుర్తించి అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే రహదారి సౌకర్యం కల్పించి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.