బీజేపీలో ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ ఆమోదం

జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికారికంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనమయ్యారు. ఈ విలీనాన్ని రాజ్యసభ చైర్మన్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

బీజేపీలో చేరిన ఈ ఏడుగురు సభ్యులు క్రమశిక్షణతో పనిచేసే నాయకులని, పార్లమెంటరీ నిబంధనలకు లోబడి వ్యవహరిస్తారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన వారిని ఆహ్వానించారు.

అదే సమయంలో విపక్షాల ‘ఇండి’ కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ కూటమిని వీడి బయటకు రావాల్సిన సమయం వచ్చిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.