
• శ్రీ కొరకంటి నాగబాబు మృతదేహం దుబాయ్ నుంచి కుటుంబ సభ్యులకు చేరే వరకు సమన్వయం
• శస్త్రచికిత్స చేయించుకుని ఇబ్బంది పడుతూ కూడా నిరంతర పర్యవేక్షణ
జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల కోసం, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గం కార్యకర్తల కోసం ఎంతగా పరితపిస్తారో చెప్పడానికి నిదర్శనం ఈ సంఘటన. శస్త్రచికిత్స చేయించుకుని ఇబ్బంది పడుతూ కూడా పిఠాపురం జనసైనికుడు శ్రీ కొరకంటి నాగబాబు మృతదేహం దుబాయ్ నుంచి కుటుంబ సభ్యులకు చేరేవరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరితపించారు. పిఠాపురం నియోజకవర్గం, చేబ్రోలు గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీ కొరకంటి నాగబాబు ఈ నెల 18న దుబాయ్ దేశంలో దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారు. జీవనోపాధి, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అంతదూరం వెళ్ళి మరణించడం చాలా బాధాకరం. విషయం తెలుసుకున్న వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించారు. దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళారు. చట్టపరమైన అంశాలు ఏమైనా ఉంటే తక్షణం పూర్తిచేసి శ్రీ కొరకంటి నాగబాబు మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయాలని కోరారు. జనసేన గల్ఫ్ టీమ్ సహాయంతో ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు. శస్త్రచికిత్స చేయించుకుని ఇబ్బంది పడుతూ కూడా ప్రతిరోజు నాగబాబు మృతదేహం ఇంటికి చేరే అంశం ఎక్కడ వరకు వచ్చిందని అధికారులతో సమన్వయం చేస్తూనే ఉన్నారు. శ్రీ కొరకంటి నాగబాబు మృత దేహాన్ని దుబాయ్ నుంచి హైదరాబాద్ తెప్పించడం దగ్గర నుంచి, శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి పిఠాపురం వరకు అంబులెన్స్ ఏర్పాటు చేయడం వరకు ప్రతి అంశాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యవేక్షించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలందరినీ సొంత కుటుంబసభ్యులుగా భావిస్తారు అనేందుకు నిదర్శనం ఈ సంఘటన అని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.