అర్ధవీడులో జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

గిద్దలూరు నియోజకవర్గం: అర్ధవీడు మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబా ఆదేశాల మేరకు జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాలరంగయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

చలివేంద్ర ప్రారంభం అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ వీరభద్రపురం చర్చి, అర్ధవీడు సాయిబాబా గుడి, ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తదనంతరం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకొని అర్జీలను స్వీకరించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

అలాగే జనసేన పార్టీ పొలిటికల్ కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు రాజకీయ సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో అర్ధవీడు మండల అధ్యక్షుడు కలగట్ల అల్లూరయ్య, బైరా శేషాద్రి నాయుడు, శ్రీనివాసులు, బండి రంగయ్య, తోట కేశన్న, ఎర్నాకుల పోల్ రాజు, రంగస్వామి, అంబటి దాసు బాబు, సంగతాలి సోమయ్య, బైరా పాండు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.