500 మెట్లు ఎక్కి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు

పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు కొండపల్లి శివ గణపతి మరియు సిరిపోతు ప్రసాద్ బుజ్జి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం 500 మెట్లు కాలినడకన ఎక్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పాలకొండ: పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు సూచనల మేరకు జనసేన నాయకులు భక్తి పూర్వకంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు కొండపల్లి శివ గణపతి, సిరిపోతు ప్రసాద్ బుజ్జి భక్తిశ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కాలినడకన 500 మెట్లు ఎక్కి చేరుకుని, జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేశారు.

భక్తితో దీపం వెలిగించి, మనసారా ప్రార్థిస్తూ ఆయన త్వరగా కోలుకుని మరింత ఉత్సాహంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని కోరుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని జనసేన శ్రేణులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.