
అమరావతి: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సుధాకర్‌రావు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మండల, జిల్లా, గ్రామ స్థాయిలలో తగిన విధంగా కార్యక్రమాలను రూపొందించాలని జడ్పీ సీఈఓలు, డీపీఓలకు సూచించారు. గ్రామ సభలకు అన్ని శాఖల అధికారులు మరియు ప్రజలు తప్పనిసరిగా హాజరయ్యేలా ముందుగానే సమాచారం అందించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.