
శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఫోన్లో పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స జరిగి బయటకు రాలేని పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధను వ్యక్తం చేశారు. శ్రీ భాస్కరరావు గారి కుమారుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారికి శ్రీ @PawanKalyan గారు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ భాస్కరరావు గారు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
శస్త్రచికిత్స కారణంగా బయటకు రాలేని పరిస్థితిలో ఉండటంతో, ఆయన అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ గారు బాధను వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో శ్రీ భాస్కరరావు గారి కుమారుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఫోన్లో పరామర్శించారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆయనకు ధైర్యం చెప్పారు.
అలాగే శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.