
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారు 70వ దశకం నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైనది. విజయవాడ ఈస్ట్, వేమూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి సేవలందించారు. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి కుమారుడు, నా సహచర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పితృ వియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలి. శ్రీ మనోహర్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.