వాడపల్లి పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు

కొత్తపేట: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన శస్త్రచికిత్స నుండి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తూ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా స్వామివారికి మొక్కు తీర్చుకున్నారు. ఆయన ఏడు ప్రదక్షిణలు చేసి, 111 కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారి పేరుతో హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.