ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు క్షమార్హం: డాక్టర్ ఏలూరి

మార్కాపురంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు.

ఈ వ్యాఖ్యలు క్షమార్హం కానివని పేర్కొన్న ఆయన, ఖర్గే వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ప్రజల చేత ఎన్నికైన ప్రధానిని ఈ విధంగా అవమానించడం కాంగ్రెస్ పార్టీ తీరును ప్రతిబింబిస్తుందని విమర్శించారు.

ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చౌకబారు రాజకీయాలకు దిగజారడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దెబ్బతీస్తాయని, ప్రజల్లో అసహనం కలిగిస్తాయని తెలిపారు. డీఎంకే వంటి పార్టీలు ఈ వ్యాఖ్యలను సమర్థించడం వారి వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోందని పేర్కొన్నారు.

దేశ నాయకులపై గౌరవం చూపడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని సూచించిన ఆయన, ఖర్గే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.