పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం శృంగేరి మఠంలో ప్రత్యేక పూజలు

అనంతపురం: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ అనంతపురం పట్టణంలోని శృంగేరి మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకుడు పాలగిరి చరణ్ తేజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోట్లాది మంది గుండెచప్పుడు, జనసైనికుల రథసారథి అయిన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా పోతుల మనోజ్, జనసేన నాయకులు అంజి, సాయి, మంజునాథ్, గణి రాయల్, అయూబ్, హరి, అశోక్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.