







పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు.
పిఠాపురం పట్టణంలోని కుక్కుటేశ్వర స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించగా, పురుహుతికా అమ్మవారికి కుంకుమాభిషేకం చేశారు. అనంతరం ఆలయ మండపంలో గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, మహా సౌర యాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పిఠాపురం పై మాన్ కమిటీ సభ్యులు నిర్వహించగా, నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.