కోడుమూరులో పవన్ కళ్యాణ్ ఆరోగ్యంకోసం 101 టెంకాయలతో ప్రత్యేక పూజలు

కోడుమూరు నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్‌లోని అన్నప్ప స్వామి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆకెపోగు రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఆకెపోగు రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడి మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో ఆయన త్వరగా కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నిమ్మకాయల మద్దిలేటి, బాల చంద్ర, కృష్ణ, బాలముని, నాగరాజు, వెంకట, రాజు, గోపి, నరేష్, చందు, వినయ్, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.