
అమలాపురం: మహిపాలవీధిలోని ఆకాశం ఆసుపత్రి ఆవరణలో నూతనంగా డయాలసిస్ యూనిట్ ప్రారంభించారు. ఫెయిర్ ఫాక్స్ కంపెనీ ప్రాయోజకత్వంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా స్టెర్లింగ్, సిఎస్బి, గ్లోబల్ అల్యుమిన కంపెనీలు డయాలసిస్ యంత్రాలను సరఫరా చేశాయి.
ఈ యూనిట్ ద్వారా రోజుకు సుమారు 15 మంది వరకు డయాలసిస్ చికిత్సను ఉచితంగా పొందే అవకాశం కల్పించబడింది. అమలాపురం మరియు పరిసర ప్రాంతాల్లో డయాలసిస్ అవసరమైన రోగులు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించింది.
సోమవారం ఉదయం 11:03 గంటలకు పూజా కార్యక్రమాలతో ఈ యంత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీహరి, డాక్టర్ ఆనంద్, డాక్టర్ కాంతిప్రియతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఫెయిర్ ఫాక్స్ తరఫున జి. శాస్త్రి, స్టెర్లింగ్ తరఫున జి.వి.ఆర్, సిఎస్బి మేనేజర్ మరియు ఇతర ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.